99TV News

    విజయ్‌తో నా బంధంపై వస్తున్న వార్తలను ఖండించిన రష్మిక | Rashmika Mandanna

    విజయ్‌తో నా బంధంపై వస్తున్న వార్తలను ఖండించిన రష్మిక | Rashmika Mandanna

    హైదరాబాద్:

    విజయ్‌ దేవరకొండతో (Vijay Deverakonda) తన వివాహ బంధం మరియు వ్యక్తిగత జీవితంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు, విమర్శలపై ప్రముఖ నటి రష్మిక (Rashmika) తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె ఓ సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేస్తూ ట్రోలర్స్‌కు గట్టి బదులిచ్చారు.

    ‘కాఫీ విత్ కరణ్’ వ్యాఖ్యలపై స్పందన

    ఇటీవల ప్రసారమైన ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఈ జోడీ పాల్గొని అనేక విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. ‘రష్మిక పెళ్లి చేసుకోమని నన్ను 100 సార్లు అడిగింది’ అని సరదాగా వ్యాఖ్యానించారు. దీనిని కొందరు తప్పుగా అర్థం చేసుకుని విజయ్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు ప్రారంభించారు.

    దీనిపై స్పందించిన రష్మిక.. ‘‘మేము ఇచ్చిన ఇంటర్వ్యూను సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఎవరో ఒకరిని తప్పుబట్టడంపైనే ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. నేను పెళ్లి ప్రతిపాదన తెచ్చినప్పుడు విజయ్‌ సమయం తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తు గురించి ఆలోచించడానికి తగినంత సమయం తీసుకోవడం ఎప్పుడూ ముఖ్యమే’’ అని పేర్కొన్నారు.

    విజయ్‌ అంటే నాకు పిచ్చి ప్రేమ: రష్మిక

    విజయ్‌తో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘తన జీవితంలో ఏం కావాలో విజయ్‌కు బాగా తెలుసు. జీవితాన్ని చూసే మా భిన్నమైన దృక్పథాలే మా బంధాన్ని మరింత బలంగా ఉంచుతున్నాయి. పెళ్లి అనేది ఉంగరాలు మార్చుకోవడం మాత్రమే కాదు, ఇద్దరూ కలిసి జీవితాన్ని నిర్మించుకోవడం. అవును..! విజయ్‌ అంటే నాకు పిచ్చి ప్రేమ. అందులో తప్పేముంది?’’ అని ప్రశ్నించారు.

    కష్టకాలంలో అతనే అండగా నిలిచాడు

    సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘‘ఒకప్పుడు నాతో స్నేహంగా ఉన్న వారు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా పక్కన లేరు. ఆ సమయంలో విజయ్‌ నాకు అండగా నిలిచాడు. ఇంటర్నెట్‌లో ప్రచారమయ్యే ఎడిట్ చేసిన వీడియోలు, నిరాధారమైన వార్తలను ఎక్కువగా నమ్ముతున్నారు. నేను బాధలో ఉన్నప్పుడు, నాకు సలహా కావాలనుకున్నప్పుడు మీరెవరూ నా పక్కన లేరు, కానీ అతను ఉంటాడు’’ అని స్పష్టం చేశారు.

    కుటుంబం గురించి పూర్తిగా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఫెమినిజం ముసుగులో జరుగుతున్న వేధింపు మాత్రమేనని రష్మిక అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను తన జీవితంలో ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నానని, పదేళ్లుగా తనను ఆదరిస్తున్న కన్నడ స్నేహితులు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.